Injustice anywhere is a threat to Justice everywhere
I have a Dream .. ఇది అబ్దుల్ కలాం గారి ప్రసంగాల స్పూర్తి తో ఇచ్చిన డిక్లరేషన్ కాదు. నేను ఏదో సాధించాలి తపన తో అన్న మాటకూడా కాదు. ఒక అద్బుతమైన, స్ఫూర్తిదాయకమైన ప్రసంగం నకు నాంది అయిన మాటలు. నేనుకిరణ్ కుమార్. మీ హోస్ట్.. కి. రి వ్యూపాడ్ కాస్ట్ కి స్వాగతం. మిత్రులారా.. I have a Dream .. ఆ మాటలు. మార్టిన్లూథర్ కింగ్ జూనియర్ 1963 ఆగస్ట్ 28, న నల్ల జాతీయుల పౌర హక్కుల ఉద్యమం లో భాగంగా వాషింగ్టన్ DC లో ఇచ్చిన చారిత్రాత్మక ప్రసంగం లో మాటలు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటేనిన్ననే అనుకోకుండా జాలీ LLB 2 అనే సినిమా చూశాను. Injustice anywhere is a threat to justice everywhere అనే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కొటేషన్ తో సినిమా ముగిసింది. ఆ చిన్న వాక్యం లో నిజంగా ఎంత అర్థం వుందోఅనిపించింది. మార్టిన్ లూథర్ కింగ్జూనియర్ యొక్క ఈ మాటలు సమాజంలో ఎంతప్రాముఖ్యత కలిగివున్నాయో నేను చర్చించబోతున్నాను. సాధారణంగా న్యాయం జరగకపోవడం లేదా అన్యాయం జరగడం చాలారూపాలలో జరగవచ్చు. ఆర్థికపరమైన అన్యాయాలు, గుర్తింపు కోసం అన్యాయాలు బాధ్యతలు, విధులు,లేదా మన అధికార పరిధి నిర్వర్తన పరమైన విషయాలలో అన్యాయాలు, ఇలాంటివి సమాజం లో అంటేఇండ్లలో , కార్యాలయాల్లో , పని ప్రదేశాలలో రాజకీయ సంస్థలలో జరుగుతూవుంటాయి. కళ్లముందు అన్యాయం జరుగుతుంటే చాలా మంది దాని గురించి మాట్లాడానికి, చర్చించటానికిభయపడుతూ వుంటారు. దానికి కారణం వారి వ్యక్తిగత, ఉద్యోగ , సామాజిక పరమైన ఇబ్బందులకుగురి అవుతాము అన్న భావన కావచ్చు. లేదా కొన్ని సందర్భాలలో మనమే ఆ అన్యాయం చేయడం లోభాగం అవుతాము. అలాంటి మౌనం రేపు అతి పెద్ద భూతమై మన ముందే నిలబడుతుంది. సమాజంలోఎవరికో జరిగిన అన్యాయం వైరస్ లా అన్నీ వైపులకు వ్యాప్తి చెంది మనల్ని ప్రభావితం చేస్తుంది. అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మనదికాదు అనేభావన కలిగితే, సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతాయి.నన్ను ప్రభావితంచేయకపోతే, అది నా సమస్య కాదు అనే ధోరణి సమాజాన్ని మరింతఅనైతికంగా మారుస్తుంది. పాఠశాలలోవిద్యార్ధులు కొంతమంది డ్రగ్స్ కి అలవాటు అయ్యారని తెలిస్తే మనకి ఎందుకులే స్కూల్హెడ్మాస్టర్ చూసుకుంటారు.. ఆ తల్లిదండ్రులు చూసుకుంటారు మనకి అనవసరంగా ఎవరితోఎందుకు గొడవలు అని మౌనంగా వుంటే తరువాతి రోజు అదే ప్రమాదం మన పిల్లలకి జరగదని ఏంగ్యారంటీ వుంటుంది. సమాజం లోని వ్యక్తులేకాదు కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడా అన్యాయం పట్ల మౌనంగా వుండి అన్యాయానికి మద్దతు ఇవ్వడం మనకి కనపడుతుంది.మీరు గమనించే వుంటారు. కొన్ని సినిమాలకు ప్రభుత్వాలు టికెట్ రేట్స్ పెంచుకోవటానికిఅనుమతి ఇస్తున్నాయి. అది ఒక అలవాటుగా మారిపోయింది. సినిమా బడ్జెట్ పెరిగింది అనిఎక్కువ రేట్స్ కి టికెట్స్ అమ్మకోవడానికి అనుమతి ఎప్పుడో ఇచ్చి వుంటారు.. అదిపూర్తిగా అన్యాయం. దాన్ని ఎవరు కూడాఖండించకపోవడం, పట్టించుకొకపోవడం జరిగే సరికి ప్రతి సినిమాకి, ప్రతి థియేటర్ లోనూఅదే అన్యాయం కొనసాగుతుంది. ఒక చోట జరిగిన injustice వలనప్రతి చోట జస్టిస్ ప్రమాదం లో పడింది కదా..
సమాజం లో వివిధ స్థాయిలలో అన్యాయానికి గురి అయ్యే వారి పట్ల బాధ్యత గా కనీసస్థాయి లో మోరల్ సపోర్ట్ కూడా వ్యక్తపరచకుండా, వారు గతంలో చేసిన సహాయాన్ని కూడామర్చిపోయి స్వార్ధం కోసం ఆ అన్యాయాన్ని సమర్థించే ప్రయత్నం చేసే వారు మన కళ్లముందు కనపడుతూ వుంటారు. దానికి కారణాలుకూడా ఇంతకుముందే చెప్పుకున్నాము కదా.. ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఇలాంటి అన్యాయానికి గురి అయ్యి మౌనంగా వుంటున్ననాయకులు ఇప్పుడు మనకి కనపడుతున్నారు. ఇకపోతేసాంకేతికత పెరగడం వలన ఇప్పుడు చాలామంది చైతన్యవంతం అయ్యి ఎక్కడైనా అన్యాయం జరిగితేదానిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం చేస్తున్నారు. ఇది చాలా మేరకు సంతోషించదగ్గపరిణామమే కానీ, సమాజం లో ఉన్నత స్థాయి లో వున్న వారు చేసే అన్యాయాలు సోషల్ మీడియా వేదికగామనం ప్రశ్నించిన సరే వారికి వున్న స్పెషల్ ప్రివిలేజ్ మూలంగా ఆ అన్యాయం న్యాయంగామారే అవకాశాలు చాలా తక్కువ. అంతే కాకుండా సోషల్ మీడియా లో ప్రశ్నించిన వారికి జరిగేఅన్యాయాలు మళ్ళీ ఇంకో టాపిక్. మన వంతు బాధ్యతగా మనం చేయాల్సింది ఏమిటంటే మన పనుల వలన ఎవరైనా అన్యాయానికి గురి కాకుండా చూడటం, మనకిఅన్యాయం జరుగుతుంటే ప్రశ్నించడం నేర్చుకోవాలి. న్యాయంగా మనకి చెందని దాని గురించి మనంఆశించకూడదు. న్యాయంగా మనకి చెందే దానిని వదులుకోకూడదు. కనీసం ఇలా చేద్దాం.. ఈ పాడ్కాస్ట్ లో కొన్ని అంశాల పట్ల సూచనలు చేసిన ఆత్మీయ సోదరి శ్రీమతి దుర్గా శైలజ గారికికృతజ్ఞతలు తెలియచేసుకుంటూ.. మీ హోస్ట్ కిరణ్ కుమార్.. సైనింగ్ ఆఫ్.. బై.
8 Feb 2025
"అందరూ అలానే చేస్తున్నారుగా!"
కొన్నిసార్లు మనం కొన్ని పనులను, ఆలోచనలను ఎటువంటిలాజిక్ లేకుండా అవతలివారు చేశారు కాబట్టి మనం అలానే చేయాలి అనే మూస ధోరణులలో చేస్తూవుంటాము. దానికి కారణం..?
9 Aug 2024
కర్ణుడు ఎంత గొప్పవాడు?
కల్కి సినిమా చూసిన తరువాత మా అబ్బాయి అడిగిన సందేహం ఈ పాడ్కాస్ట్ కి ప్రేరణ
26 Apr 2024
EVM ల పనితీరు - సందేహాలు - అనుమానాలు
2024 లోక్ సభ ఎన్నికల నేపధ్యం లో మళ్ళీ EVM లపై చర్చ మొదలు అయింది. సుప్రీం కోర్ట్ ఈ రోజు కూడా EVM లపై పూర్తి నమ్మకాన్ని కలిగించే విధంగా వాటిపై వేసిన అన్నీ ఆరోపణలను స్వీకరించటానికి నిరాకరించింది. ఈ నేపధ్యం లో EVM ల పని తీరు వాటిపట్ల సందేహాలు, అనుమానాలు . EVM లు ఎంత మేర సురక్షితమో ఒక్కసారి చూద్దాం. చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ పాడ్ కాస్ట్ ఎపిసోడ్ ని చివరి వరకు వినండి.
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
11 Feb 2024
కోడిగుడ్డు తంటసం
కోడిగుడ్డు తంటసం అంటే కోడి గుడ్డు తో చేసే వంటకం మాత్రం కాదండోయ్... మనకు బాగా పరిచయం వున్న మాటనే... తెలుసుకోవాలని ఉందా... ఇంకెందుకు ఆలస్యం... పాడ్ కాస్ట్ వినేయండి..
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
28 Jan 2024
అబద్దం
What is the truth about lying?
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
1 Jan 2024
మంధరలు వున్నారు జాగ్రత్త
కి. రి. వ్యూ శ్రోతలకు నమస్కారం మరియు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మనం రోడ్ల పై వెడుతుంటాం .. దారిలో బోర్డ్ కనపడుతుంది. ప్రమాదకర మలుపు జాగ్రత్త వహించండి. మనం మన బండి స్పీడ్ తగ్గించి చూసుకొని వెళ్తాం.. కొన్ని ఇండ్ల ముందు గేట్ కి బోర్డ్ కనపడుతుంది. కుక్క వున్నది జాగ్రత్త అని.. మనం వెంటనే గేట్ తీయకుండా ఇంట్లో వారిని పిలవడమమో , గేట్ చప్పుడు చేసి వారిని బయటకు రమ్మని కోరడమో చేస్తాము.. మరి మన చుట్టూ మందరలు , మందరులు వుంటారు. వారి గురించి మనల్ని ఎవరు హెచ్చరిస్తారు.. మనమే జాగ్రత్త పడాలి.. అదీ ఈ రోజు మన పాడ్ కాస్ట్ అంశం..
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
21 Nov 2023
పోలింగ్ సమయం లో ప్రిసైడింగ్ ఆఫీసర్ విధులు - బాధ్యతలు
మీ అందరికీ తెలుసు .. ప్రస్తుతం మన
రాష్ట్ర అసెంబ్లీ కి నవంబర్ 30 న ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికల ప్రక్రియ
సజావుగా జరగటానికి ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది ఎంతో శ్రమిస్తారు .
ఎన్నికల విధులలో జిల్లా కలెక్టర్ మొదలుకొని కింది స్థాయి ఉద్యోగి వరకు అనేక
బాధ్యతలు విరామం లేకుండా నిర్వరిస్తూ వుంటారు. ముఖ్యంగా పోలింగ్ స్టేషన్ లో విధులు
నిర్వర్తించే సిబ్బంది లో ముఖ్య పాత్ర ప్రిసైడింగ్ ఆఫీసర్ ది. పోలింగ్ సమయం లో
వివిధ సందర్బాలలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎలా వ్యవహరించాలో మనం ఈ రోజు తెలుసుకుందాం. ఈ
విషయాలు ఈ రోజు మనకి తెలుపటానికి మనతో పాటు డాక్టర్ వి. నరసింహ కుమార్ గారు
వున్నారు. వీరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల , భద్రాచలం నందు ప్రిన్సిపాల్ గా పదవి
విరమణ చేసి వున్నారు. గతం లో జరిగిన ప్రతీ
ఎన్నికలలో వీరు వివిధ ఎన్నికల విధులకు సంబంధించి మాస్టర్ ట్రైనర్ గా
వున్నారు. అద్భుతమైన విశ్లేషణ , వివరణ వీరి స్వంతం.
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
1 Oct 2022
హైదరాబాద్ లవ్ స్టోరీస్
హైదరాబాద్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ సహాయం తో శర వేగంగా విస్తరించిన మహా నగరం.. మరి ఒకప్పుడు... అందమైన ప్రేమ కథలు చిగురించాయి.. ప్రియుడు తమ ప్రేయసి కోసం అద్భుతమైన ప్రేమ చిహ్నలు నిర్మించారు.. ఆ అందమైన ప్రేమ కథల్లో ముచ్చటైనా మూడు కథలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.. వింటారు కదా
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
29 Sept 2022
పుస్తకం హస్తభూషణం
చదవటం అనేది ఒక మంచి అలవాటు... ఇంటర్నెట్ యుగం మొదలు అయిన తరువాత ఈ అలవాటు క్రమంగా దూరం అవుతుంది...పుస్తకాలకు, నాకు వున్న అనుబంధం ను వివరించే ప్రయత్నం చేస్తాను.
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
25 Sept 2022
కొత్త పదాల గోల
ప్రతీ రోజు మన రోజువారీ సంభాషణల్లో భాగంగా వివిధ కొత్త పదాలు వినపడే అవకాశం వుంది.. మరి ఆ కొత్త పదాలు ఎలా పుడుతున్నాయి... వాటి అవసరం ఎంత? అనే దానిపై ఒక చిన్న కిషియోటికా.. ( అంటే ఏంటి అని అడగకండి... ఏదో సుత్తి వీరభద్రరావు గారు వాడారని నేను వాడాను )
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
17 Sept 2022
ఛాయ్ పే చర్చా 2
మిత్రులారా.. మొదటి ఎపిసోడ్ లో మనం ఛాయ్ గురించి కొంత మాట్లాడుకున్నాము.. ఈ రెండో ఎపిసోడ్ లో ఛాయ్ ఎగుమతి లో చైనా వారి మోనోపలి కి ఎలా చెక్ పడిందో , దీనికి మన దేశానికి సంబందం ఏమిటో తెలుసుకుందాం..
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
14 Sept 2022
ఛాయ్ పే చర్చ
టీ మన జీవితంలో ఒక భాగం అయిపొయింది.. ప్రపంచంలో నీరు తరువాత ఎక్కువ మంది తాగేది టీ నే.. దాని పుట్టు పూర్వత్తరాలు తెలుసుకుందామా మరి
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
25 Aug 2022
నాస్టాల్జిక్ మెమొరీస్
ప్రతీ వ్యక్తి తన గత అనుభవాలు తలచుకొని వివిధ అనుభూతులకు లోనవుతాడు... అదే విధంగా విద్యార్జన దశలో ముఖ్యమైన గ్రాడ్యుయేషన్లో పొందిన జ్ఞాపకాల సమాహారమే ఈ నాస్టాల్జిక్ మెమొరీస్
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
21 Aug 2020
జాతీయ విద్యావిధానం 2020 మొదటి భాగం మూడవ అధ్యాయం. Foundation Literary and Numerac
జాతీయ విద్యా విధానం 2020 మొదటి భాగం లో రెండవ అధ్యాయం అయిన ఫౌండేషన్ లిటరసీ మరియు న్యూమరసీ పై పాడ్ కాస్ట్. ఇది వినటానికి లింక్ పై క్లిక్ చేసిన .మీ బ్రౌజర్ ని సెలెక్ట్ చేసుకుంటే తరువాత పేజ్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ ని పైకి స్క్రోల్ చెస్తే ప్లే బటన్ కనపడుతుంది.. క్లిక్ చేస్తే ప్లే అవుతుంది.. లేదా మీ ఫోన్ లో ప్రి ఇన్స్టాల్ చేసిన ఏదైనా పాడ్ కాస్ట్ ఆప్ ద్వారా వినవచ్చు...
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
10 Aug 2020
జాతీయ విద్యా విధానం 2020
జాతీయ విద్యా విధానం 2020-పాఠశాల విద్య -ECCE -ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్-ఒక పరిచయం
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
9 Aug 2020
నూతన విద్యా విధానం 2020
నూతన విద్యా విధానం 2020 - ఒక పరిచయం
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
24 May 2020
భాష
భాష కి సంబంధించి నాకున్న కొద్దిపాటి అవగాహనను మీతో పంచుకుంటున్నాను..
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
11 May 2020
నా పరిచయం
నాకు పాడ్ కాస్ట్ కొత్త.. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని....,🙏🙏🙏
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/kiran-kumar455/message
Reach and audience
Public platform figures. Ratings count people who left a rating, not total listeners.
Spotify
5.0 / 5
14 ratings
Contact Ki re View
Guest appearances
Books guests
Based on episode analysis; this does not confirm that the show is currently accepting guests.
Host of Ki re View?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.
Explore this show Podcast research with Pod Engine