ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెలుగులొ మీరు వినాలి అనుకునె విషయాలు గురించిన వివరాలు మాకు తెలపాలి అనుకుంటె, hello@sunoindia.in (mailto:hello@sunoindia.in) కి email పెట్టండి.
(Samacharam Sameeksha will bring to you news and views of all the latest developments from Telangana and Andhra Pradesh. The podcast will also analyse news coverage and bring in seldom heard perspectives and will help you cut through the noise. Priority will be given to issues from the two Telugu states. Write into us at hello@sunoindia.in with your suggestions and feedback.)
సిజేరియన్ ప్రసవాలు vs నార్మల్ ప్రసవాలు part 2 (Caeseran delivery Vs Normal delivery part 2)
ఇవ్వాల్టి పార్ట్ 2 ఎపిసోడ్లో సిజేరియన్ ,నార్మల్ డెలివెరీస్ లో అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమిటి ?
తల్లి బిడ్డల ఆరోగ్య రీత్యా ఎలాంటి డెలివరీ ఎలాంటి సందర్భాల్లో మేలు చేస్తుంది ?
డెలివరీ సమయాల్లో డాక్టర్స్ ఎదుర్కొనే ఇబ్బందులు presures ఏమిటీ ?
అనే అనేక విషయాల గురించి సునో ఇండియా వారి సమాచారం సమీక్ష లో హోస్ట్ చాముండేశ్వరి తో ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ . స్నేహ గారి ఇంటర్వ్యూ లో వినండి .
See sunoindia.in/privacy-policy (https://www.sunoindia.in/privacy-policy) for privacy information.
30 Oct 2022
సిజేరియన్ ప్రసవాలు vs నార్మల్ ప్రసవాలు part 1 (Caeseran delivery Vs Normal delivery part 1)
దేశం లో అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం సిజేరియన్ ప్రసవాలలో కూడా పెరుగుదల రికార్డు చేసింది . సి. సెక్షన్ డెలివెరీస్
దాదాపు 60% . కొన్ని జిల్లాలో ఇంకా ఎక్కువని రిపోర్ట్స్ . నేషనల్ సగటు 22% కంటే ,WHO permisable రేట్ 10-15 % కంటే ఎక్కువే .
గత కొద్దీ కాలం గ తెలంగాణ ప్రభుత్వం సిజేరియన్ ప్రసవాలు తగ్గించి ,నార్మల్ డెలివెరీస్ ను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది .
ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి ?
ప్రజల ఆలోచన ,వైద్య రంగం లో వచ్చిన మార్పా ?
ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎక్కువ ఫీజు వస్తుందనే వాదన నిజమా ?
నార్మల్ లేదా సిజేరియన్ ప్రసవాల్లో ఏది ? ఎప్పుడు ? ఎంతవరకు తల్లి బిడ్డకు మంచిది
సిజేరిన్ ప్రసవాల తగ్గింపులో ప్రభుత్వం ,ఫామిలీ , డాక్టర్స్ ,ఇతర midwiffery రోల్
ఎంత వరకు ఉంది ?
అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎంతవరకు అవసరం ?
ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం సునో ఇండియా వారి సమాచారం సమీక్షలో హోస్ట్ చాముండేశ్వరి తో ప్రముఖ gynaecologist DR . అనురాధ. m గారి ఇంటర్వ్యూ పార్ట్ వన్ లో వినండి.
See sunoindia.in/privacy-policy (https://www.sunoindia.in/privacy-policy) for privacy information.
26 Oct 2022
తలసేమియా గురించి ఎందరికి తెలుసు? (How many people know about Thalassemia?)
రక్తం అంటే ఎర్రని రంగని తెలుసు . రక్తం చూస్తే ఆందోళన , భయం కలగటం natural . రక్తం లో ఉన్న groups, classifications గురించిన అవగాహన అందరికి లేదు . అలాంటిది జన్యు పరమైన blood related వ్యాధుల గురించి తలసేమియా గురించి ఎందరికి తెలుసు?
ప్రజలలో అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మే 8 వ తేదీన ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. తలసేమియా అనేది జన్యు రక్త రుగ్మత, . తలసేమియా ఉన్న పిల్లవాడు అలసట, బలహీనత, నెమ్మదిగా పెరుగుదల, పేలవమైన ఆకలి మరియు రక్తహీనత వంటి లక్షణాలను చూపుతాడు. చికిత్స రక్త మార్పిడితో ఉంటుంది, దీని వల్ల కుటుంబంపై మానసిక మరియు ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది.
తలసేమియా అంటే గ్రీక్ భాషలో సముద్రం అని అర్థం. ఈ వ్యాధికి గురైన చిన్నారికి జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. ఒకవేళ ఉత్పత్తయినా ఎక్కువకాలం ఉండదు. హిమోగ్లోబిన్ నిల్వలు పడిపోయిన ప్రతిసారీ హిమోగ్లోబిన్ని కృత్రిమంగా రక్తం ద్వారా అందించాలి.
నివేదికల ప్రకారం, ప్రతి సంవత్సరం సగటున 10,000 మంది పిల్లలు తలసేమియాతో జన్మిస్తున్నారు మరియు జనాభాలో 3-4% మంది క్యారియర్లు. అందువల్ల, తల్లిదండ్రుల ఇద్దరికీ సమగ్ర జన్యు పరీక్ష యొక్క అవగాహన పెంచడం చాలా అవసరం.ప్రీ-నాటల్ టెస్టింగ్ మరియు క్యారియర్ స్క్రీనింగ్ అవసరం తలసేమియా కేసులను నివారించడానికి కీలకం పనిచేస్తుంది.
రక్తం పంచుకుని పుట్టిన పిల్లలకు తమకు తెలియని , నివారణ లేని ,లైఫ్ లాంగ్ రక్త మార్పిడి అవసరం అయ్యే తలసేమియా లాంటి అనారోగ్యం వస్తే రోగి ,కుటుంబం పరిస్థితి ఏంటి ? ఎక్కడికి వెళ్ళాలి ? వైద్యం ఎలా ? రోగ నిర్ధారణ ఎలా ? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవాళ్టి సునో ఇండియా వారి సమాచారం సమీక్షలో హోస్ట్ D .చాముండేశ్వరి తో ప్రముఖ డాక్టర్ అదితి కిశోర్ ఇంటర్వ్యూ లో తెలుసుకుందాము .
See sunoindia.in/privacy-policy (https://www.sunoindia.in/privacy-policy) for privacy information.
Contact సమాచారం సమీక్ష - A Telugu News Podcast
Guest appearances
Books guests
Based on episode analysis; this does not confirm that the show is currently accepting guests.
Host of సమాచారం సమీక్ష - A Telugu News Podcast?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.
Explore this show Podcast research with Pod Engine