Namaskaram!
I feel that there is nothing more joyful than listening to a nice story. As kids we would always ask our elders to tell us a story. To recreate that magic and to appeal to that listener in you, I am presenting these stories in audible form. You can listen to them at your leisure. I wish all the listeners a wonderful jouney with The కథా-holics.
I would love to hear back from you. Please mail your suggestions or feedback to kathapramodam@gmail.com.
మనమంతా ఈ కథలోని సుబ్బయ్య ఉరఫ్ బావగాడు లాంటి వ్యక్తుల్ని ఎప్పుడో ఒకప్పుడు చూసి ఉంటాం. అలాంటి వారి సేవని గుర్తు చేసుకుందాం. విని ఆనందించండి.
7 Jul 2020
అమరావతి కథలు - అంపకం
ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపేప్పుడు, కూతురిని ప్రాణంగా పెంచుకుని, తన జీవితాన్ని కూతురితో ముడివేసుకున్న ఓ తండ్రి పడే వేదన కంట తడి పెట్టిస్తుంది. ఇంత చిన్న కథలో అంత బాధ (చూ)పెట్టిన కథకుడికి ధన్యవాదాలు.
6 Jul 2020
అమరావతి కథలు - అరుగరుగో సుబ్బయ్య మేష్టారు
మనస్సుని సున్నితంగా స్పృశించే కథ. మన స్కూల్లో మన ఇష్టమైన టీచర్ ని గుర్తుకు తెస్తుంది. సుబయ్య మేష్టారి లాంటి టీచర్స్ అందరికీ గురుపూర్ణిమ సందర్బంగా శతకోటి వందనాలు.
4 Jul 2020
అమరావతి కథలు - సీతారామాభ్యాం నమః
మారుతూన్న, మారిన కాలానికి చిన్న మచ్చు తునక. రామాయణ, భారతాలను, అందులోని విలువలను ఉగ్గుపాలతో మరియు విద్యాలయాల్లో పాఠ్యఅంశాలలో భాగంగా భావితరానికి బోధిస్తే తప్ప ఈ భరత జాతికి మనుగడ లేదు. మనమంతా ఈ యజ్ఞంలో పాల్గొందాం. రామాయణ , మహాభారతాలను సంస్కృతంలో చదువుదాం. మన పిల్లలకు, మనవళ్లకు, మనవరాళ్లకు చెబుదాం.
3 Jul 2020
అమరావతి కథలు - మనసు నిండుకుంది
ఎంతో నిగూఢార్థం చాలా సామాన్యంగా చెప్పిన అద్భుతమైన కథ. ఇంతకన్నా ఎక్కువ చెబితే మీ అనుభూతిని తగ్గించిన వాడినైతానన్న భయం. యద్భావం తద్భవతి. విని ఆనందించండి.
2 Jul 2020
అమరావతి కథలు - రెండు గంగలు
వర్షం గురించిన వర్ణన అద్భుతం. భోరున కురుస్తున్న వర్షంలో ఎప్పుడైనా తడిసి ముద్ద అయిన వారు ఎక్కువగా కనెక్ట్ అవగలుగుతారు
1 Jul 2020
అమరావతి కథలు - ఒక రోజెళ్లి పోయింది
ఈ కథ మనల్ని ఒక్క క్షణం ఆపి ఆలోచించేలా చేస్తుంది. మన రోజూ వారి పరుగులు, ఆరాటాలు,ఆర్భాటాలు అన్నీ అవసరమా అనిపిస్తుంది. కథలోని పిచ్చయ్య గారిలా ప్రశాంతంగా జీవితం గడిపేస్తే చాలు కదా అనిపిస్తుంది. విని ఆనందించండి.
3 May 2020
పదిహేను పైసలకి ఆరుగురు పిల్లలు
A funny story about the life of children in a joint family, how they are made to run errands, how they are caught between the elders - all from the children's perspective.
2 May 2020
నా పెళ్లి సమస్య తీరింది
మన పెదాల మీద చిరునవ్వు తెప్పించే, మన, మన పిల్లల చిన్నప్పటి అమాయకమైన అనుమానాలు, ఆలోచనలు,
1 May 2020
కారులో షికారు
ఇదివరకటి రోజుల్లో అంటే కారు మాటి మాటి కీ ఆగిపోయే రోజుల్లో, కారు ఆగిపోవడం వల్ల ఎన్ని లాభాలో ఇంకో కోణం లోంచి చెప్పే చిన్న కథ
29 Apr 2020
మా ఇంట్లో మంగళ హారతి
అన్ని functions లో మంగళ హారతి ఇచ్చే వాళ్ళ, తీసుకొనేవాళ్ళ హడావిడి
28 Apr 2020
కరెంటు వింజామర
పాత కాలంలో , ఫ్యాన్లు లేనప్పుడు అందరూ విసనకర్రలతో విసురుకునేవారు. ఫ్యాన్ ఒక అమ్మమ్మకి తెచ్చిపెట్టిన సుఖం, కర్రతో సీలింగ్ ఫ్యాన్ ని తిప్పడాన్ని కూడా ఒక నౌకరు ని అదిలించినట్టుగా చూడడాన్ని హాస్యంగా చెప్పిన కథ. మనకందరికీ పాత రోజులని జ్ఞప్తికి తెస్తుంది.
27 Apr 2020
పండుగాడు
మనమంతా ఎప్పుడో ఒకప్పుడు ఈ కథలోని, జంకూ గొంకూ లేకుండా వసపిట్ట లాగా మాట్లాడే చిన్న పిల్లవాన్ని చూసి గాని లేదా అటువంటి వాడి గురించి విని గాని ఉంటాం. చూడని వాళ్లకి, వినని వాళ్లకి, పండుగాణ్ణి పరిచయం చేసి, వాడి ముద్దు మాటలు విని ఆనందించే అవకాశాన్ని ఈ కథ అందిస్తుంది.
26 Apr 2020
పాటల పుస్తకం
ఇప్పటి పెద్దవాళ్ళ చిన్నప్పటి సినిమా సంగతులు. చిన్నపిల్లలు టిక్కెట్టు లేకుండా సినిమాకి వెళ్లడాలు, పాటల పుస్తకాలు,పాటలు నేర్చుకోడాలు, అతిథులకి వినిపించడాలు బోలెడన్ని చిన్ని చిన్ని విషయాలు పొందుపరిచిన సరదా కథ.
25 Apr 2020
జాగర్త అది వింటుంది
కొత్తగా టేప్ రికార్డర్ చూసినప్పుడు మనకి కలిగిన అద్భుతాశ్చర్యానందాలు మన తరం వారికి గుర్తు ఉండే ఉంటాయి. ఈ కథ మనకి ఆ అనుభూతుల్ని జ్ఞప్తికి తెస్తుంది. ఈ తరం వాళ్ళు అంటే మన millenial పిల్లలు, మనల్ని చూసి నవ్వేలా చేస్తుంది
24 Apr 2020
పూల జడ!
వేసవి సెలవల్లో అమ్మమ్మ ఊరికి వెళ్లడం, అమ్మమ్మ గారాబం, ఊరి వాళ్ళ ఆప్యాయతల గురించి వివరించే సంఘటనల సమాహారం.
24 Apr 2020
పెళ్లి లో వీపు విమానం మోత!
పెళ్లి సందడి, అందులో ప్రముఖంగా పేకాట రాయుళ్ల సందడి గురించి చెప్పే చిన్న హాస్య కథ.
24 Apr 2020
Season-1 Intro: పొత్తూరి విజయలక్ష్మి గారి కథలు.
I am a great fan of Smt. Potthuri Vijayalaksmi garu who has uniquely captured the glimpses of life of her childhood in a series of short stories. I could connect to the stories and had tried to tell everone i know to read these stories. Not satisfied with this, I have decided to take these stories to a wider audience including many of the telugu people who do not know how to read Telugu and also the present generation who do not know how life was like in olden days.
23 Apr 2020
The కథా-holics (Trailer)
Contact The కథా-holics
Guest appearances
Does not typically book guests
Based on episode analysis; this does not confirm that the show is currently accepting guests.
Host of The కథా-holics?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.
Explore this show Podcast research with Pod Engine