The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-011) డీనా మెర్రియమ్ గారు తన పూర్వజన్మలలో తాను సీతమ్మ యొక్క పరిచారిక అయిన మీనాక్షి గానూ, తరువాతి జన్మలో అనసూయ గానూ ఆవిడకు సీతమ్మతో ఉన్న అనుబంధాన్ని ఎంతో బాగా వివరించారు.2) ఈ భాగం లో సీతమ్మ పుట్టుకకు కారణం, సీతమ్మ జననం,ఆమె బాల్యం,ఆమె ఎల్లప్పుడూ ప్రకృతి తో అనుసంధానమై ఉండడం,సకల జీవరాసుల పట్ల సీతమ్మకు గల కరుణ ,దయల గురించి ఈ ఎపిసోడ్ లో మీనాక్షి వెర్షన్ చెప్పారు.3) ఇంకా సీతమ్మ స్వయంవరం, వివాహం, అయోధ్య పయనం, అరణ్యవాసం లాంటివి అన్నీ మీనాక్షి తనువు చాలించేంతవరకూ జరిగినదంతా ఎంతో చక్కగా క్లుప్తంగా వివరించారు.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-02
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-021) కాలచక్రం గురించి వివరణ . ఒక కాలచక్రం పూర్తి అవడానికి 24 వేల సంవత్సరాలు పడుతుందని, అవరోహణ క్రమంలో 12000 సంవత్సరాలు, ఆరోహణ క్రమంలో 12000 సంవత్సరాలు ఉంటాయని, ఒక్కొక్క క్రమంలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఉంటాయని,అవరోహణ క్రమంలో భూమి గురుత్వాకర్షణ శక్తి నుండి దూరంగా వెళుతుందని, ఆరోహణ క్రమంలో భూమి గురుత్వాకర్షణ శక్తికి దగ్గరగా వస్తుందని ఎంతో చక్కగా చెప్పడం జరిగింది.2) అనసూయకు పూర్వజన్మల సంస్కారాల గురించి, అనసూయ కుటుంబం గురించి అనసూయ సేవ గురించి, శ్రీరాముడు శరీరం చాలించడం లవకుశలు పరిపాలించడం యుగంలో వస్తున్న మార్పుల గురించి వివరణ .3) అనసూయ, వాళ్ల తల్లి సోమ ఆశ్రమానికి వెళ్లడం కలవడం, సోమ వాళ్లకు అనసూయ ఋషి మాత గొప్పతనం గురించి చెప్పటం సీతామాత సమ్మతంతోనే లంకలో ప్రవేశించిందని చెప్పటం తో ఈ భాగం ముగిస్తుంది.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-03
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-031) మిథిలా నగరం యొక్క సాంప్రదాయాల గురించి, ఆహారం నిల్వ చేసుకోవడం, ప్రకృతి సమతుల్యం గురించి చెప్పడం జరిగింది.2) అనసూయ మాత గొప్పతనం గురించి , సీత కొరకు గోదావరి మాత ఉద్భవించడం.3) అయోధ్యకు, మిథిలా కు బాహ్యంగా అంతరంగంగా ఉండే తేడా , సీతామాతకు ప్రకృతితో ఉన్న సంబంధం, సీతారాములు అడవికి వెళ్లడానికి గల కారణాలు చెప్పడం జరిగింది.4) సీతారాముల మధ్య ఉండే అద్వితీయమైన ప్రేమ, ప్రకృతికి దగ్గరగా లవకుశలను సీతామాత పెంచడం, ప్రతిదీ సీతమ్మ తల్లి సంపూర్ణ సమ్మతితోనే జరిగిందని చెప్పడం, సీతమ్మకు అనసూయ మాత తపస్సుఫలం ధార పోయడం, సీతారాములు పంచవటికి చేరటం.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-04
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-041) రోజు రోజుకి పెరుగుతున్న రావణుని అరాచకాలను ఎదిరించడానికి ఖచ్చితమైన కారణం ఉండాలి అనే శ్రీరామచంద్రుని నిర్ణయం. 2) రావణుని ఎదిరించడానికి ఎన్నో రహస్యమైన మంత్రాలు మరియు ముద్రలు యోగి అగస్త్య మహాముని మరియు ఆయన భార్య లోపాముద్ర దేవి నుండి పొందడం.3) శూర్పనఖ వలన తన భర్తను కోల్పోయిన చంద్రికను సీతమ్మ తల్లి ఓదార్చి ఆమెకు ధ్యానము మరియు తన శక్తిని అందించారు.4) మొట్టమొదటిసారి పంచవటిలోని తమ కుటీరానికి వచ్చిన సూర్పనఖని తన తెలివితేటలతో సీతమ్మ తల్లి ఎదుర్కోవడం అద్భుతం.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-05
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-051) శూర్పనఖ వెళ్లిన తర్వాత సీతామాత ,రాముడు ,లక్ష్మణుల వారు ముగ్గురి మధ్య చర్చ.2) గోదావరి తల్లి ,సీతామాతతో చర్చ.3) సీతమ్మ అనుమతితో రావణుడు లంకకు తీసుకువెళ్లడం లంకలో సీతమ్మ తల్లి కష్టాలు.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-06
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-061) సీతమ్మ తల్లిని రావణాసురుడు మానసికంగా బాధపెట్టిన సన్నివేశాలు.2) సీతమ్మ తల్లికి రావణాసురుడు కి మధ్య యుద్ధం జరుగుతుంది, సీతమ్మ తల్లి ప్రేమను మించిన శక్తి లేదు అని హెచ్చరిస్తుంది.3) అమ్మ రావణాసుడుకి ఇంత శక్తి రావటం గల కారణం ఏంటని ప్రశ్నించుకుంటుంది రావణుడి గత జన్మ తెలుసుకొని అతనికి గుర్తు చేస్తుంది.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-07
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-071) రావణుడి జన్మ పరంపర గురించి పార్వతమ్మ సీతమ్మకు వివరించడం.2) పార్వతమ్మ సీతా దేవిని ఎరుక తో ఉండు,ఎలాంటి నకారాత్మక భావనలకు లోనూ కాకు అని హెచ్చ రించడం.3) త్రిజటతో సంభాషణ4) రావణుడికి సీతమ్మ హిత బోధ.5) దేవవృతి జన్మవృత్తాoథం.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-08
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-081) గత జన్మల యొక్క వాసనలు ఈ జన్మలో ఎలా పరిణమిస్తాయి అన్నదానికి వివరణ.2) అహంకారం , తీవ్రమైన మనో భావోద్వేగాలను అధిగమించడానికి అంతరంలోని మన నిజతత్వమైన ప్రేమ , శాంతి , ఆనందానికి అనుసంధానం కావాలి అన్న సందేశం.3) మన చుట్టూ నకారాత్మక భావనలతో కూడిన నెగెటివ్ ఎనర్జీ వున్నప్పుడు, వాటికి ప్రభావితం కాకుండా అత్యంత ఎరుకతో ఉండటం గురించి తెలియ చెప్పబడింది.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-09
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-091) లక్ష్మణులు వారు గాయపడిన సందర్భంగా సీతామాత దుఃఖించి తనని దక్కించుకోవడానికి, యమధర్మరాజు గారికి తన జీవితంలో కొంత భాగాన్ని లక్ష్మణులు వారి కోసం దార పోసిన సందర్భం.2) రాములువారు రావణాసురుడి మీద ఆఖరి బాణం వేసి తన చూపుతో , మరియు ప్రేమతో రావణాసురుడికి ఆత్మసాక్షాత్కారం చేసిన ఘట్టం.3) యుద్ధం అయ్యాక రాములు వారు సీతామాత దగ్గరికి వచ్చే సమయం లో సీతమ్మ ధ్యాన స్థితి నుంచి బయటికి రావాలి అని చూస్తే తనలోంచి అగ్ని లంకలో ఉన్న చెడు అంతా దహనం చేసి , ఆమె చేతి వంట తో లంకలోని వారందరికీ శాంతి చేకూర్చింది ఇదే సమయానికి అయోధ్యలో ఉన్న సోమ ద్వార పద్నాలుగేళ్ల వనవాసం పూర్తి అయిందని కూడా తెలుస్తుంది.4) సీతామాత తాను అయోధ్య కి తిరిగి వెళ్లే దారిలో తాను మాట ఇచ్చిన ప్రకారం ప్రతి వాళ్లని కలిశారు.5) అయోధ్య కి చేరిన సీతామాత అయోధ్యలో ఉన్న మంచిని, చెడుని ఒకే సారీ చూసిన సంఘటన మరియు అఖిత ,మీనాక్షిల బంధం గురించిన సంఘటన.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-10
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-101) మీనాక్షి పూర్వీకులైన అఖిత మిథిలలో మరణించి తిరిగి అయోధ్యలో జన్మించి సీతామాత వనవాసంలో ఉన్నప్పుడు సీతామాత క్షేమం కోసం "సరయు నది" ఒడ్డున ఎన్నో ప్రార్థనలు చేసిందని చక్కగా వివరించారు.2) సీతామాత తాను గర్భవతిని అని తెలుసుకుంటుంది . ఆరోజు కలలో తనకు ముందు జన్మలో బృగుమహర్షి ఇచ్చిన శాపం కూడా గుర్తుకు వచ్చి అరుంధతి మాత వద్దకు వెళ్లగా, అక్కడ ఖ్యాతి అమ్మవారు కూడా వుంటారు. సీతమ్మకు ప్రకృతిలో పిల్లలను పెంచడం గురించి, ప్రకృతి సంరక్షణ కోసం ,భవిష్యత్తులో పృథ్విని పరిరక్షించడం కోసం సీతమ్మ చేయవలసిన పనుల గురించి చక్కగా తెలియజేసి సీతమ్మకు స్వాంతన కలిగించారని తెలిపారు.3) సీతారాముల మధ్య ఉన్న అద్వితీయమైన ప్రేమ గురించి, వారి ప్రేమ అయోధ్య వాసులకు ఎంత రక్షణ ఇస్తుందో చక్కగా తెలియజేశారు.4) ఎవరినైనా క్షమించాలి అన్నా, ఎవరికైనా కృతజ్ఞతలు తెలియజేయాలన్న ఆ కాలంలో ఋషులు అందరూ తపస్సు ద్వారానే తెలియజేసే వారని చక్కగా తెలియజేసారు.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-11
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-111) లవకుశల జన్మవృత్తాంతం మరియు శ్రీ రాములవారి అక్క యోగిని శాంత మాత గురించి వివరించారు.2) ధ్యానం, ప్రేమ తత్వం యొక్క గొప్పతనం మరియు పిల్లల పెంపకం.3) సంకల్ప శక్తి యొక్క గొప్పతనం మరియు *యోగిని అనసూయ మాత *మందాకిని నది ఎలా భూలోకానికి తెచ్చారు.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-12
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-121) మహాయోగిని అరుంధతి మాత వశిష్టుల వారి కథ.2) విశ్వామిత్రులు వారు గాయత్రీ మంత్రాన్ని తన తపశ్శక్తితో భూలోకానికి తీసుకువచ్చిన సంఘటన.3) అహల్యమ్మ ,గౌతమ మహాముని యొక్క కథ.4)క్షమా గుణం , ప్రేమతత్వం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటాం అంతేకాదు క్షణికావేశం, కోపం, నమ్మకం లేకపోవడం వల్ల కలిగే అనర్ధాలు గురించి కూడా తెలుసుకుంటాం.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-13
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-131) ఆడపులిని సముదాయించి, ఆడపులి బాధ గురించి సోమకివివరణ.2) పులి బారిన పడి కొడుకుని కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించిన సీతమ్మ.3) గ్రామంలో పులిని వేటాడే ఆలోచనను విరమించుకోవాలని ప్రజలను మార్చిన సీతమ్మ.4) మనిషికి, ప్రకృతికి వైరం మొదలైందని సీతమ్మ బాధపడటం.50 ఆశ్రమంలో అత్యాచారానికి గురయిన తల్లి, కూతురికి పరిచర్యలు చేసిన సీతమ్మ6) తల్లి, కూతురి బాధలు సీతమ్మ తీసుకున్న విధానం.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-14
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-141) సీతమ్మ యొక్క మరొక పరిచారిక అయిన సోమా , మీనాక్షి మరుజన్మ అయిన అనసూయకు తాను చూసిన సితమ్మను వివరిస్తున్నారు.2) సీతమ్మను చూడడానికి ఆ చుట్టు పక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా వచ్చేవారనీ ,అమ్మ చాలా అలసిపోతున్నట్లు కనిపించేవారనీ సోమ చెపుతుంది.3) ఖ్యాతి మాత,భృగు మహర్షిలకు ముక్తి లభించడం, పరమేశ్వరుడు పార్వతి మాత లను పిలిచి విందు భోజనము పెట్టి సేవించుకోవడం, జనకమహారాజు సీతమ్మని కలవడానికి రావడం, నిరంతరం సీతమ్మ అంతర్ముఖం అయిపోవడం లాంటివి అన్ని సోమా ఈ భాగంలో పంచుకున్న విషయాలు.4) సీతమ్మ ,తాను తిరిగి వెళ్లే సమయం ఆసన్నమైంది అని చిన్న చిన్న సూచనలు ఇచ్చినట్లుగా కూడా ఇందులో చెప్పబడి ఉంది.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-15
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-151) అమ్మ సీతా మాతా కళ్యాణ మహోత్సవం అంటే అది ఒక దివ్య కల్యాణము, ఆ దివ్య కల్యాణము నకు దేవ దూతల, యోగి లు, స్వయంగా ఆ పార్వతి పరమేశ్వర లు రాక ఎంతో అద్భుతంగా వివరించి చెప్పారు. 2) సీతా మాతా ఒక కాంతి రూపంలో తన శరీరాన్ని వదిలి వెళ్లడం సోమ అద్భుతంగా వివరించి చెప్పారు. 3) అనసూయ గత జన్మ లో మీనాక్షి గా ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే వృత్తాంతం.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-16
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-16 Conclusion1)అజిత్ ,అనసూయ ల కలయిక వాళ్ళ ఇద్దరి గత జన్మల, ప్రస్తుత జన్మ ల గురించి వివరణ.2) సోమ యొక్క అంతిమ దశ. 3) అజిత్ యొక్క నాయనమ్మ అఖిత కథ.4) ప్రేక్షకుల స్పందన లు.
1 Jul 2022
The Untold Story of Sita Telugu Episode-17
The Untold Story of Sita book Telugu Brahmavidwanmani Saroja GullapalliEpisode-17 (సీతాయణం లోని విలువలు)1) సీతమ్మ తల్లి ప్రోద్బలంతో జనక మహారాజు ఆడపిల్లలకి గురుకులం నెలకొల్పారు అనే విషయం. మరియు రామాయణం లో ఎందరో యోగులు మునుల పేర్లు తెలుసు కానీ వారి భార్యలైన అరుంధతి మాత, అనసూయ మాత, ఖ్యాతి అమ్మ, లోపాముద్ర దేవి, అహల్య దేవి, ముఖ్యంగా సీతమ్మ తల్లి గొప్పతనం గురించి వారి శక్తి సామర్థ్యాల గురించి సీతా యనంలో తెలుసుకోవచ్చు.2) ప్రకృతి పట్ల మన బాధ్యత అన్ని జీవరాశుల పై కరుణ పిల్లలని ప్రకృతికి దగ్గరగా పెంచడం ఎంతో విలువైన జ్ఞానం.3) అనంతమైన షరతులు లేని ప్రేమ సీతమ్మ తల్లి రావణాసురుని పై కూడా కరుణతో మంచి మార్గంలోకి తేవాలని ప్రయత్నించడం. ఎంతటి క్లిష్టమైన పరిస్థితులను కలిగించిన వారినైనా అర్థం చేసుకొని ప్రతి పరిస్థితికి సమర్పించుకొని ముందుకు సాగటం.4) సీతాయనం లో ముఖ్యంగా కాలచక్రం గురించి తెలుసుకున్న తర్వాత మన జీవితంలో వచ్చే పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతాము.5) సీతాయనం ద్వారా అద్భుతమైన విలువలను అందించిన దీన మెరయన్ గారికి మరియు తెలుగులో వివరించిన సరోజ మేడమ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.
Reach and audience
Public platform figures. Ratings count people who left a rating, not total listeners.
Apple Podcasts (US)
5.0 / 5
1 ratings
Contact The Untold Story of Sita in Telugu
Guest appearances
Does not typically book guests
Based on episode analysis; this does not confirm that the show is currently accepting guests.
Host of The Untold Story of Sita in Telugu?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.
Explore this show Podcast research with Pod Engine